Monday, December 23, 2024

డబుల్ ఇండ్ల నిర్మాణాలతో ఆనందంలో లబ్ధిదారులు

- Advertisement -
- Advertisement -

నస్రుల్లాబాద్ : డబుల్ ఇండ్ల నిర్మాణాలతో లబ్ధిదారులు ఆనందంలో ఉన్నారని, బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూంలు మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఈ సందర్బంగా సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలని రాష్ట్ర శాసస సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి తాండలో నూతన గృహం ప్రవేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధ్దిదారులు స్పీకర్‌తో మాట్లాడారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూంలు నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త విఠల్, బిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, నాయకులు కంది మల్లేశ్, స్థానిక నాయకులు, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News