Friday, December 20, 2024

రేపిస్టులకు ఉరే సరి

- Advertisement -
- Advertisement -
  • సామూహిక అత్యాచారం కేసుల్లోనూ మరణ శిక్ష విధించాలంటున్న బెంగాల్ బిల్లు
  •  ఇతర రాష్ట్రాల్లో మహిళలపై దారుణాల నేరాల సంగతి ఏమిటి?
  • మహిళా రక్షణ చట్టాలను సమర్థంగా అమలు చేయలేని అగ్ర నేతలు రాజీనామా చేయాలని డిమాండ్

కోల్‌కతా: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బెంగాల్‌కు సంబంధించినంత వరకు క్రిమినల్ కోడ్, భారతీయ న్యాయ సంహితలోని కొన్ని నిబంధనలను సవరించేందుకు ‘అపరాజిత’ బిల్లును పశ్చి మ బెంగాల్ శాసనసభ మంగళవారం ఆమోదించింది. అత్యాచారం, బాలలపై వేధింపులకు శిక్షలను ఆ సవరణలు మరింత కఠినాత్మకం చేస్తాయి.

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యా య సంహిత (బిఎన్‌ఎస్)లో పలు సెక్షన్లను సవరించడం ఆ బిల్లు లక్షం. బిఎన్‌ఎస్‌లోని సెక్షన్ 64 ప్రకారం, అత్యాచార నేరానికి నిర్ధారిత దోషి కి పదేళ్లకు తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష విధిస్తారు. దానిని యావజ్జీవ కారాగార శిక్షగా పొడిగించవచ్చు. బెంగాల్ చట్టం దానిని మారుస్తున్నది. జైలు శిక్షను ‘ఆ వ్యక్తి జీవితాంతం వర కు కొనసాగుతుంది, జరిమానా కూడా పడుతుం ది. లేదా మరణశిక్ష విధించవచ్చు’. బాధితురాలి వైద్య ఖర్చులు, పునరావాస ఖర్చులు భరించగలిగే విధంగా ఆ జరిమానా ఉంటుంది.

అత్యాచా రం బాధితురాలి మరణానికి లేదా ‘కోమా దశకు’ దారి తీసినట్లయితే నిర్ధారిత దోషికి జరిమానా విధిస్తున్న బిఎన్‌ఎస్ సెక్షన్ 66ను సవరించాలని అపరాజిత బిల్లు కోరుతున్నది, అటువంటి నేరానికి 20ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, మరణ శిక్ష విధించాలని కేంద్ర చట్టం నిర్దేశిస్తుండగా బెంగాల్ బిల్లు సదరు దోషికి మరణ శిక్ష మాత్రమే విధించాలని సూచిస్తోంది. సామూహిక అత్యాచారం కేసులకు సంబంధించిన బిఎన్‌ఎస్ సెక్షన్ 70ని సవరిస్తున్న బెంగాల్ చట్టం 20 ఏళ్ల జైలు శిక్ష ఆప్షన్‌కు స్వస్తి పలికి, యావజ్జీవ కారాగార శిక్ష, మరణ శిక్షను నిర్దేశిస్తున్నది.

తృణమూ ల్ కాంగ్రెస్ (టిఎంసి) ఆ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘అపరాజిత’చట్టం అని పేర్కొనే ‘చరిత్రాత్మక’ చ ట్టం దర్యాప్తులను వేగవంతం చేస్తుందని, కఠిన శి క్షలు విధించేలా చేస్తుందని ఆమె తెలిపారు. కోల్‌కతా కర్ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ మంగళవారం త మ పోలీస్ బలగాన్ని గట్టిగా సమర్థించారు.

ఇతర రాష్ట్రాల్లో మహిళలపై దారుణ నేరాల సంగతి ఏ మిటని మమత ప్రశ్నించారు. 2020లో ఉత్తర ప్ర దేశ్ హథ్రాస్‌లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, 2013లో బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఒక కళాశాల విద్యార్థిని హత్యాచారం, క్రితం వారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక అత్యాచారం ఘటనలను మమత ప్రస్తావించారు. ‘కాందుని కేసు (ఉత్తర 24 పరగణాల జిల్లాలో అత్యాచారం)లో మేం మరణ శిక్ష కోరాం.. కానీ ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది (కలకత్తా హైకోర్టు ఒక నిందితుని నిర్దోషిగా విడుదల చేసి, మరి ఇద్ద రి మరణ శిక్షను జైలు శిక్షగా మార్చడంపై అప్పీ ల్ దాఖలైంది). ఉన్నావ్‌లో ఏమి జరిగిందో ఎవ రూ మాట్లాడడం లేదు, హథ్రాస్ బాధితురాలికి న్యాయం జరగలేదు’ అని ఆమె చెప్పారు.

మోడీ, అమిత్ షా రాజీనామా చేయాలి
‘యుపి, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బాగా ఎక్కువ గా నేరాల రేట్లు ఉన్నాయి. అక్కడ న్యాయం జరగలేదు కానీ బెంగాల్‌లో మహిళలకు కోర్టుల్లో న్యా యం జరుగుతుంది’ మమత అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘మహిళల పరిరక్షణకు సమర్ధమైన చట్టాలను అమలు చేయలేకపోతున్న’ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధా ని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమి త్ షా రాజీనామా చేయాలని కూడా ఆమె కోరా రు. మోడీ, అమిత్ షా మమత ప్రస్తావించడం బిజెపి శాసనసభ్యుల నుంచి పెద్ద పెట్టున నిరసనలకు దారి తీసింది. ‘మీరు నాపై నినాదా లు చేయగా లేనిది ప్రధాని, హోమ్ శాఖ మంత్రి పై నేను నినాదాలు చేస్తే ఏమవుతుంది’ అని మ మత ప్రశ్నించారు. కాగా, ఉత్తర 24 పరగణాల జిల్లాలో అత్యాచారానికి, హత్యకు గురైన యువతికి నివాళిగా కొత్త చట్టానికి ఆ పేరు పెట్టారని పలువురు భావిస్తున్నారు. కొన్ని వార్తల ప్రకారం ఆమె పేరు అపరాజిత. కేంద్రం ఆమోదించిన చ ట్టాల్లోని ‘లోటుపాట్లను’ అపరాజిత చట్టం ‘పరిహరిస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News