Monday, January 13, 2025

హత్యాచార వార్తలను ప్రచురించినా శిక్షార్హం చేసే బిల్లు తేబోతున్న బెంగాల్

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: అపరజిత మహిళా, శిశు(పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాల సవరణ)బిల్లు 2024ను మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నది. ఆగస్టు 8 , 9 మధ్య రాత్రి ప్రభుత్వ ఆధీనంలోని ఆర్ జి కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం , హత్య తర్వాత కలకత్తా , బెంగాల్ అంతటా విస్తృత నిరసనల మధ్య ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. చచ్చేలా గాయపరచడం, బలాత్కారం చేసే వ్యక్తికి మరణ శిక్ష విధించే అంశం ఈ బిల్లులో ఉంది. బలాత్కార కేసులను నిర్ణీత సమయంలోగా పరిశోధించి, పూర్తి చేసే అంశం కూడా ఈ బిల్లులో పొందుపరచబడింది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే బలాత్కార కేసుల పరిశోధణ, న్యాయ విచారణ అంశాలు కోర్టు అనుమతి తీసుకోకుండా ప్రచురించడంను కూడా ఈ బిల్లు శిక్షార్హం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై నెగటివ్ పబ్లిసిటీ జరగొచ్చన్న సాకును చూపుతోంది. ఆర్ జి కర్ ఘటన తర్వాత తీవ్రమైన చట్టం తీసుకొస్తానని మమతా బెనర్జీ ఇదివరకే చెప్పారు. బెంగాల్ లో లైంగింక దాడులను తీవ్రంగా పరిగణించేలా చట్టం తెస్తానన్నది. అత్యాచారం, సామూహిక అత్యాచారం కేసుల్లో తీవ్రమైన శిక్ష పడేలా అంశాలు పొందుపరిచారు. బాధితురాలి పేరు వెల్లడించిన వ్యక్తికి కూడా మూడు నుంచి ఐదేళ్ల శిక్ష, జరిమానా పడేలా ప్రావిజన్స్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News