కోల్‌కతా : అనేక నేరాలకు సంబంధించిన కేసులున్న బీజేపీ నేత దుండగుల కాల్పుల్లో మృతి చెందారు. పశ్చిమబెంగాల్ లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహించే రాజు ఝాపై అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. శనివారం రాత్రి రాజుఝా తన స్నేహితుడితో కలిసి కారులో హైవేపై కోల్‌కతాకు వెళ్తున్నారు.
మార్గమధ్యలో ప్రధాన విరామ కేంద్రమైన శక్తిగఢ్ వద్ద ఆగారు. రాజు ప్రయాణించిన కారు హైవేపై నిలిచి ఉండగా, దాని పక్కగా మరో కారు ఆగింది. అందులో ఉన్న వ్యక్తులు రాజుతోపాటు అతడి స్నేహితుడిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఠాఝా మరణించగా, అతడి స్నేహితుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతం లోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ కమనశిష్ తెలిపారు.