Saturday, April 5, 2025

బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా సహ మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా సహ (69) గురువారం ఉదయం 10.40 గంటలకు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్‌లో కన్నుమూశారు. బుధవారం రాత్రి హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో బెర్హంపూర్‌లోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్‌లో చేరారు. ఆయన మమతా బెనర్జీ మంత్రి వర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇటీవలే ఆయనకు కోల్‌కతాలో గాల్‌బ్లాడర్ ఆపరేషన్ కూడా జరిగింది. ఆయన కోలుకున్నాక తిరిగి తన జిల్లాకు చేరుకున్నారు. కానీ బుధవారం రాత్రి ఉన్నపళంగా అనారోగ్యానికి గురయ్యారు.

సుబ్రతా సహ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. తన సంతాప సందేశంలో ఆమె ‘సుబ్రతా బాబుతో నాకు చిరకాల వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఆయన అందించిన సాంఘిక, రాజకీయ సేవలు మరచిపోలేనివి. ఆయన మరణంతో రాజకీయంగా ఓ లోటు ఏర్పడింది. సుబ్రతా షా కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం’ అని పేర్కొన్నారు.

సుబ్రతా సహ 2011లో ముషిరాబాద్ జిల్లాలోని సగర్దిఘి నుంచి ఎన్నికైన ఒకే ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఏ. ఆయన అక్కడి నుంచి మూడు పర్యాయాలు గెలుపొందారు. ఆ జిల్లాలో ఆయన మరణం పూడ్చలేనిదిగా తయారయింది. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కానీ తర్వాత ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన రాజకీయ వృత్తితో పాటు, వివిధ సాంఘిక సేవా కార్యకరమాలలో కూడా పాల్గొనేవారు. మంత్రి ఫర్హాద్ హకీమ్ ఆయనకు ప్రభుత్వం తరఫున చివరి శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News