Friday, November 15, 2024

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టారు.బుధవారం చేపట్టిన ఈ దీక్ష రెండు రోజులపాటు కొనసాగనుంది. తమ రాష్ట్రానికి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఊదాసీన వైఖరిని అవలంబిస్తుందని ఆరోపించారు. బుధవారం కోల్‌కతాలోని రెడ్‌రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆమె నిరసన దీక్ష ఆరంభించారు. గురువారం కూడా నిరసన దీక్ష కొనసాగనుంది. ఈ నిరసన కార్యక్రమంలో సిఎం మమతా బెనర్జీతోపాటు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) ఇందిరా ఆవాస్ యోజన, గృహ, రహదారుల తదితర పథకాలుకు సంబంధించిన నిధులను మోడీ సర్కారు విడుదల చేయకుండా నిలిపివేసింది. ఒబిసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయటం లేదు.

బెంగాల్‌కు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టినట్లు మమత తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన కోట్లు నిధులను కేంద్రం నిలిపివేసిందని మమత ఆరోపించారు. ఈ పథకం అమలులో బెంగాల్ అన్ని రాష్ట్రాలకంటే అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు చేయలేదన్నారు. కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోల్‌కతాలో అంబేద్కర్ విగ్రహం ఎదురుగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు మమత తెలిపారు. గురువారం సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందన్నారు. కాగాబెంగాల్‌లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో టిఎంసి అభ్యర్థి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు పూనుకున్న టిఎంసి చీఫ్ మమతా తీరును నిరసిస్తూ ధర్మా చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌తోపాటు బిజెపిని వ్యతిరేకించిన బెనర్జీ తాజాగా తమ వైఖరిని మార్చుకున్నారు. రాహుల్ అనర్హత విషయంలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సారథ్యంలోని విపక్షాల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News