Sunday, November 24, 2024

కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సిఎం విమర్శలు

- Advertisement -
- Advertisement -

Bengal CM Mamata criticizes central government

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గత ఆరునెలలుగా పనిచేయకుండా ఉన్న ఫలితమే ప్రస్తుత కరోనా సంక్షోభానికి కారణమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర మంత్రులు పనిచేసే బదులు ప్రతిరోజు బెంగాల్ లో పర్యటిస్తూ రాష్ట్రాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. స్వీకర్ ఎంపిక తర్వాత శాసనసభలో మాట్లాడిన మమత మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బిజెపి హింసను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఎన్నికల సంఘం నేరుగా సాయం చేయకుంటే బిజెపి 30 సీట్లు కూడా గెలిచేవారుకాదని మమత అన్నారు. ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయకుండానే విధులు నిర్వహించారని ఆరోపించారు.

Bengal CM Mamata criticizes central government

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News