కోల్‌కతా: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోల్‌కతాలో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణించిన మమత పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తనదైన శైలిలో నిరసనవ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాలను నడపలేని పరిస్థితి ఏర్పడినట్టు మమతా బెనర్జీ పరోక్షంగా తెలిపారు. మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రతిదీ అమ్ముతోందని విమర్శించారు. బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి బొగ్గు వరకు దేశంలోని ప్రతిదీ అమ్ముడవుతోందన్నారు. మోడీది ప్రజా, యువత, రైతు వ్యతిరేక ప్రభుత్వమ బెంగాల్ సిఎం ఫైర్ అయ్యారు. దీదీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee travels on an electric scooter in Kolkata as a mark of protest against rising fuel prices. pic.twitter.com/q1bBM9Dtua
— ANI (@ANI) February 25, 2021