- Advertisement -
కోల్‌కతా : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత చెలరేగిన హింసాకాండకు సంబంధించి సిబిఐ మొదటిసారి గురువారం రామ్‌పుర్‌హత్ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో బిజెపి కార్యకర్తను హత్య చేశారని ఆరోపిస్తూ ఇద్దరి పేర్లను చేర్చింది. ఎన్నికల ఫలితాలు మే 2 న వచ్చిన తరువాత బిజెపి కార్యకర్తలపై హత్య, లేదా ఇతర క్రూర నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిబిఐ ఇంతవరకు 34 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. బిజెపి కార్యకర్తను హత్య చేశారని ఆరోపణలకు గురైన నిందితులను విచారించడానికి సిబిఐ బృందం గురువారం ఇక్కడి ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌ను సందర్శించింది.
- Advertisement -