- Advertisement -
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఇచ్చే పురస్కారాల్లో ఈసారి మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు ప్రకటించారు. మొత్తం పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందిని పద్మ శ్రీ అవార్డులు వరించాయి. ఈ పద్మ భూషణ్ అవార్డులకు ఎంపికైన పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య స్పందిస్తూ.. తాను పద్మ భూషణ్ అవార్డును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘పద్మభూషణ్ గురించి నాకేమీ తెలియదు. దానిగురించి నాకు ఎవరూ చెప్పలేదు. ఒక వేళ వాళ్లు నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఉంటే దాన్ని తిరస్కరిస్తునాను’ అని బుద్ధ దేవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Bengal Ex CM Buddhadeb refuses Padma Bhushan Award
- Advertisement -