Tuesday, September 17, 2024

మమత సర్కార్.. తప్పు మీద తప్పు చేస్తుంది: బెంగాల్ గవర్నర్

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: రాష్ట్రంలో తప్పు మీద తప్పు జరుగుతోందని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ గురువారం వ్యాఖ్యానించారు. కోల్‌కతలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో గతనెల ఒక పిజి ట్రెయినీ డాక్టర్ హత్యాచార ఘటనపై న్యాయం కోరుతూ పెద్దపెట్టున నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ ఆరోపించారు. ప్రభుత్వం పట్ల ప్రజలలో విశ్వాసం కొరవడినందువల్లనే ఈ నిరసనలు వ్యక్తమవుతున్నాయని బుధవారం రాత్రి పెద్ద ఎత్తున జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. పాలన యంత్రాంగం తప్పు మీద తప్పు చేస్తున్నట్లు తాను గమనించానని ఆయన చెప్పారు.

పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ రెండు తప్పులు ఒక ఒప్పుకాబోవని ఆయన అన్నారు. ప్రభుత్వం ఒక పక్క చర్యలు తీసుకుంటూనే మరో పక్క ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. నేరస్థులను శిక్షించాల్సి ఉంటుందని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి తమకు న్యాయం లభిస్తుందని బెంగాల్ ప్రజలు భావించడం లేదని, ఇందుకు బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన నిరసన ప్రదర్శనలే ఉదాహరణని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి తమకు న్యాయం లభిస్తుందని ప్రజలు భావించాలని, ఇప్పుడు ఆ భావన లేదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News