Saturday, December 21, 2024

భార్యను ముక్కలుగా నరికి నదిలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను చంపి ముక్కలుగా నరికి నదిలో పడేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డార్జిలీంగ్ జిల్లాలో మహ్మాద్ అన్సారూల్- రేణుక ఖతూన్ అనే దంపతులు నివసిస్తున్నారు. రేణుక వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మహానందా నదిలో పడేశాడు. డిసెంబర్ చివరలో రేణుక కనిపించడంలేదని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రేణుక భర్తను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఆమె అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో డిసెంబర్ 24న చంపేశానని ఒప్పుకున్నాడు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News