Wednesday, January 22, 2025

పంచాయతీ ఎన్నికలు.. ఎక్కువ దళాలను నియమించాలని సిఇసికి కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో జులై 8న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు బందోబస్తు కోసం 82 వేల మంది కన్నా ఎక్కువ కేంద్రసాయుధ బలగాలను పంపించేలా కేంద్రాన్ని అభ్యర్థించాలని కోల్‌కతా హైకోర్టు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ టిఎస్ శివగ్నానమ్ అధ్యక్షతన డివిజన్ బెంచ్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్రానికి 82 వేల మంది బలగాలను పంపాలని అభ్యర్థించిందని గుర్తించింది. ఆరు కంపెనీల దళాల కోసం ఇంతవరకు కేంద్రాన్ని అభ్యర్థించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలియజేసింది. 2013 లో రాష్ట్రంలో 17 జిల్లాలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 22 కు పెరిగిందని వివరించింది. అలాగే గత పదేళ్లలో ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందని పేర్కొంది.

అయితే తగినంత మంది కేంద్ర బలగాలు ఉండేలా మరిన్ని బలగాలను పంపాలని కేంద్రానికి 24 గంటల్లో అభ్యర్థించాలని కోర్టు సూచించింది. ఆదేశాలను పాటించకపోతే ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా కోర్టు సూచించింది.కోర్టు ఆదేశాల ప్రకారం తక్షణం కేంద్రానికి అభ్యర్థన పంపుతామని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News