Monday, January 20, 2025

బిజెపి రెచ్చగొట్టే కమిటీలు: మమత విమర్శలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల దశలో హింసాకాండ పరిణామాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న బిజెపి నిజనిర్థారణ బృందాలు నిజానికి రెచ్చగొట్టే కమిటీలని విమర్శించారు. ఘటనల్లో మృతి చెందిన వారిని పరిస్థితుల వల్ల బలి అయిన వారని వ్యాఖ్యానించారు. హింసాత్మక ఘటనల్లో 19 మంది చనిపోయినట్లు తెలిపిన సిఎం మృతుల కుటుంబాలకు తలో రెండు లక్షల రూపాయల సాయం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి హోమ్‌గార్డు ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు.

చేసిందంతా చేసి బిజెపి ఇప్పుడు ఇక్కడికి నిజనిర్థారణ కమిటీలను పంపిస్తోందని విమర్శించారు. మణిపూర్‌లో దారుణ పరిస్థితి ఉంది. అక్కడికి బిజెపి కమిటీలు వెళ్లాయా? ఎన్‌ఆర్‌సి చిచ్చుతో అసోం నెలల తరబడి రగిలింది. మరి అక్కడికి బిజెపి బృందాలు వెళ్లాయా? వెళ్లలేదే. మరి గడిచిన రెండేళ్లలో బెంగాల్‌కు బిజెపి కమిటీలు 154 వరకూ వచ్చి వెళ్లాయని తెలిపిన మమత ఇవి నిజనిర్థారణ కమిటీలు కావని , కవ్వింపు చర్యల కమిటీలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News