Monday, January 20, 2025

యూనివర్శిటీల ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రిని ఉంచే బిల్లును ఆమోదించిన బెంగాల్

- Advertisement -
- Advertisement -

Mamata
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రిని నియమించే బిలును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో 182 మంది అనుకూలంగా, 40 మంది వ్యతిరేకంగా ఓట్లు పడడంతో ‘పశ్చిమ బెంగాల్ విశ్వవిద్యాలయ చట్టాలు(సవరణ)బిల్లు 2022’ను ఆమోదించారు. ఆ బిల్లును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ జగ్‌దీప్ ధనకర్ అనేక సందర్భాలలో ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించారని కూడా ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. కాగా ఈ బిల్లు ద్వారా ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా నియమిస్తే ‘రాజకీయ జోక్యం’ కాగలదని బిజెపి వ్యతిరేకించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిని నియంత్రించాలనుకుంటోంది అని బిజెపి ఎంఎల్‌ఏ అగ్నిమిత్ర పౌల్ వాదించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News