Wednesday, January 22, 2025

మోస్టు వాంటెడ్ మావోయిస్టు నేత సబ్యసాచి గోస్వామి అరెస్టు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత సబ్యసాచి గోస్వామి అలియాస్ ‘ కిశోర్’ను పశ్చిమ బెంగాల్ పోలీసులు పురులియా జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం చెప్పారు. గోస్వామి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జార్ఖండ్ సరిహద్దు సమీపంలోని బాఘ్‌ముండి పోలీసు స్టేషన్ పరిధిలో చైనియా గ్రామం సమీపంలోని అడవిలో గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు అధికారి చెప్పారు. జార్ఖండ్ సరిహద్దుల్లో గోస్వామి కదలికలకు సంబంధించి తమకు సమాచారం లభించిందని, దీంతో తాము దాడి చేసి ఆయనను చౌనియా సమీపంలోని అడవిలో అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. గోస్వామి వద్దనుంచి కొన్ని రౌండ్ల తూటాలు, ఒక పిస్టల్, కొన్ని డాక్యుమెంట్లు కనుగొన్నట్లు తెలిపారు.

గోస్వామి ఎన్‌ఐఎకు చెందిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడని, అతని తలపై రూ.10లక్షల రివార్డు ఉందని ఆ ఐపిఎస్ అధికారి చెప్పారు. బెంగాల్‌లో మావోయిస్టు ఉద్యమాన్ని తిరిగి బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని, అందుకోసం నిధులను కూడా సేకరిస్తున్నాడని ఆయన చెప్పారు. మావోయిస్టు కేడర్‌లో‘ కిశోరేడా’గా పరిచితుడైన గోస్వామి దక్షిణ 24 పరగణాల జిల్లా సోడేపూర్ రోడ్డు ప్రాంతానికి చెందిన వాడు. గోస్వామి 2000 సంవత్సరంలో కోల్‌కతా సిటీ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. 2003 04లో రాష్ట్ర కమిటీలో కూడా ఉన్నాడు. ఇటీవలే ఆయనకు మావోయిస్టు పార్టీ తూర్పు రీజియన్ బ్యూరో ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఆయనను గతంలో బెంగాల్ పోలీసులు, కేంద్ర ఏజన్సీ అనేక సార్లు అరెస్టు చేశాయి కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News