- Advertisement -
అమరావతి: అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ సంచరిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చోడవరం మండలం గంధవరంలో గేదెపై పులి దాడి చేసింది. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లొందని గ్రామ సర్పంచ్ తెలిపాడు. గుంపుగా బయటకు వెళ్లాలని సూచించాడు.
- Advertisement -