Saturday, April 5, 2025

బెంగాలీ దర్శకుడు తరుణ్‌ ముజుందార్‌ పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

Tarun Majumdar

కోల్ కతా:  ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్‌ ముజుందార్‌(92) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కిడ్నీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బంగ్లాదేశ్ లోని బోగ్రా జిల్లాలో 8 జనవరి 1931లో జన్మించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా తరుణ్‌ మజుందార్‌ 1985లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. బాలిక వధు(1976), కుహేలి(1971), పలతక్‌(1963), గనదేవత(1978), శ్రీమాన్‌ పృథ్వీరాజ్‌(1972) వంటి పలు హిట్‌ చిత్రాలు తెరకెక్కించారు. భారత ప్రభుత్వం ఆయన్ను 1990లో పద్మశ్రీతో సత్కరించింది. దీనితోపాటు ఐదు ఫిలింఫేర్‌ అవార్డులు , లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు అందుకున్నారు. తరుణ్‌ 2018లో చివరిసారిగా ‘అధికార్‌’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News