Thursday, December 19, 2024

రాణికి దుస్తులు బెంగాళీ యువతి తయారీ..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: దుస్తుల రూపకల్పనలో ప్రఖ్యాతిగాంచిన బెంగాళీ మహిళా డిజైనర్ ప్రియాంక మాల్లిక్ పేరు ఇప్పుడు లండన్‌లో మార్మోగుతోంది. 29 ఏండ్ల ఈ ఫ్యాషన్ డిజైనర్ రూపొందించిన దుస్తులే ఇప్పుడు రాణి కెమిల్లా పట్టాభిషేకం వేళ ధరించారు. రాణి కెమిల్లాకు డ్రస్సుతో పాటు రాజు ఛార్లెస్ రాజరిక గౌన్‌కు అలంకృత బ్రూచ్‌ను కూడా ఆమెనే రూపొందించారు. సుందరమైన దుస్తులు పంపించినందుకు ఈ బెంగాళీ యువతికి పట్టాభిషేకానికి రావల్సిందిగా ఆహ్వానం అందింది.

తనకు ఇటువంటి ప్రశంసలు దక్కడం తాను ఈ పట్టాభిషేక ఆహ్వానం అందుకోవడం చాలా సంతోషదాయకం అని ప్రియాంక తెలిపారు. హుగ్లీ జిల్లాలోని బదినాన్ గ్రామానికి చెందిన ప్రియాంక తాను అనారోగ్యంతో ఉండటం వల్ల లండన్‌లో పట్టాభిషేకం కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న తన మనసంతా ఇప్పుడు లండన్‌లోనే ఉందన్నారు.

Also Read: పసుపు పారాణీ ఆరక ముందే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News