Monday, January 13, 2025

బెంగాల్‌లో మరో మోడల్ ఆత్మహత్య!

- Advertisement -
- Advertisement -

3 రోజుల్లో ఇద్దరు మోడళ్ల బలవనర్మరణం

Bengali model Manjusha Niyogi found dead in Kolkata

కోల్‌కత: నగరంలోని పటూలి ప్రాంతంలోగల తన ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ మరో మోడల్ మృతదేహం శుక్రవారం లభించింది. మూడు రోజుల్లో ఇటువంటి సంఘటన జరగడం ఇది రెండవసారి. మృతురాలిని మంజుష నియోగిగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం తన స్నేహితురాలైన మోడల్ డి మజుందర్ మరణించడంతో తన కుమార్తె మంజుష తీవ్ర డిప్రెషన్‌కు లోనైనట్లు ఆమె తల్లి తెలిపారు. బుధవారం డమ్‌డమ్ ప్రాంతంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో మోడల్ డి మజుందర్ మృతదేహం సీలింగ్‌కు వేలాడుతూ లభించింది. పెళ్లి కుమార్తె మేకప్ ఫోటో షూట్లలో మజుందర్ చాలా పేరు పొందారు. రెండు వారాల క్రితం ప్రముఖ టెలివిజన్ నటి పల్లవి డే మృతదేహం కూడా గర్ఫా ప్రాంతంలోని ఆమె అదె అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News