Thursday, January 23, 2025

వైరల్ వీడియో: డ్రైవర్‌గా మారిన ఎసిపి.. నెటిజన్లు ఫిదా

- Advertisement -
- Advertisement -

కర్నాటక: బెంగుళూరు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బి. రామచంద్ర డ్రైవర్ బస్సును నడిపిన వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ప్రయాణిస్తున్న బస్సులో సడన్ గా డ్రైవర్ అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో ప్రయాణికులతో సహా ట్రాఫిక్ మథ్యలో బస్సు నిలిచిపోయింది. గమనించిన ఎసిపి డ్రైవర్ గా మారి బస్సును నడిపారు. ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష నేతల సదస్సు సందర్శన సందర్భంగా ట్రాఫిక్‌ను నియంత్రించే బాధ్యతను ఏసీపీ రామచంద్రకు అప్పగించారు.

ఎసిపి తమ విధులు నిర్వహిస్తుండగా రూట్ 330 బస్సు డ్రైవర్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయని గమనించి రోడ్డు పక్కనే వాహనాన్ని ఆపారు. డ్రైవర్‌కు సహాయం చేయడానికి అంబులెన్స్‌ను పిలిపించిన రామచంద్ర సత్వర బాధ్యతాయుతమైన చర్య తీసుకున్నారు. అయినా అతను అక్కడితో ఆగకుండా జనాన్ని ఎక్కించుకుని బస్సును కిలోమీటరుకు పైగా నడపారు. అతని వేగవంతమైన ఆలోచన ఆగిపోయిన బస్సు వల్ల వచ్చే ట్రాఫిక్‌ను తగ్గించింది. అధికారి బస్సు నడిపిన వీడియోను ప్రయాణికులు రికార్డ్ చేసి సామాజిక మాద్యమాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News