Monday, January 20, 2025

బెంగళూరు బాంబు పేలుడు.. సిసిటివిలో నిందితుడి కదలికలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో అనుమానితుడి కదలిక చిత్రాలు రికార్డు అయ్యాయి. దుండగుడు కెఫేలో బ్యాగు ఉంచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానితుడి సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం తనిఖీలు చేసింది. ఎన్ ఎస్ జీ, బాంబు స్క్వాడ్ బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలి 10 మందికి గాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News