Sunday, December 22, 2024

బాలుడి ఆచూకీని పట్టించిన సోషల్ మీడియా..

- Advertisement -
- Advertisement -

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న తన కోచింగ్ సెంటర్ నుంచి జవనరి 21న బయల్దేరిన ఆ 12 ఏళ్ల బాలుడు ఇంటికి చేరకుండా అదృశ్యమైపోయాడు. డీన్స్ అకాడమీకి చెందిన గుంజూరు బ్రాంచ్‌లో 6వ తరగతి చదువుతున్న పరిణవ్ పోలీసుల కన్నా ఒకడుగు ముందే ఉండి వారిని ముప్పతిప్పలు పెట్టాడు. సిసిటివి ఫుటేజ్‌ల ద్వారా ఒక ప్రదేశంలో కనిపించిన పరిణయ్‌ను పట్టుకోవడానికి పోలీసులు అక్కడకు వెళ్లేలోగానే అతడు అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లిపోయేవాడు. నగరంలోని ప్రధాన బస్సు స్టేషన్ మెజిస్టిక్‌తో పోలీసుల దర్యాప్తునకు బ్రేకు పడింది. ఈ సమయంలోనే సోషల్ మీడియా రంగంలోకి దిగింది. కొద్ది మంది నెటిజన్లు మెజిస్టిక బస్సు స్టేషన్‌కు కూడా వెళ్లి ఆ బాలుడి గురించి ఆరాతీశారు.

ఆ బాలుడి పోస్టర్లను ఆన్‌లైన్‌లో సర్కులేట్ చేయడంలో మాత్రం సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషించింది. అవే ఆ బాలుడి ఆచూకీని కనిపెట్టడంలో కీలక భూమిక పోషించడం విశేషం. సొంత పని మీద బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా తన ఫోన్‌లో కనిపించిన ఫోటోలను పోలిన బాలుడిని చూసి ఆమె గుర్తు పట్టింది. వెంటనే ఆ బాలుడిని పలకరించింది. ఆ బాలుడి ఫోటోలను వివిధ సోషల్ మీడియా గ్రూపులలో ఆమె పోస్టు చేసింది. వెంటనే ఆమెకు ప్రతిస్పందన లభించింది. తన పేరు పరిణయ్ అని ఆ బాలుడు నిర్ధారించడంతో వెంటనే అతడిని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో నిలిపి నాంపల్లి రైల్వే అధికారులకు ఆమె అప్పగించింద.

తన కుమారుడు హైదరాబాద్‌కు ఎలా వెళ్లాడో తమకు అర్థం కావడం లేదని పరిణయ్ తండ్రి సుకేష్ తెలిపారు. తన కుమారుడి ఆచూకీ కనిపెట్టడంలో సాయపడిన అపరిచితులైన నెటిజన్లకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సుకేష్ ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో పరిణయ్ పోస్టర్లు విస్తృతంగా షేర్ చేసిన కారణంగానే హైదరాబాద్‌లో ఆ మహిళ తన కుమారుడిని గుర్తు పట్టగలిగారని ఆయన చెప్పారు. కాగా..పరిణయ్ తల్లి కూడా తన కుమారురు లభించినందుకు ఆనందంతో ఒక వీడియోను పోస్టు చేశారు. అంతకుముందు అదృశ్యమైన తన కుమారుడిని ఇంటిరి రమ్మని వేడుకుంటూ ఆమె పోస్టు చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News