Monday, December 23, 2024

వామ్మో…బెంగళూరులో 133 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన వాన?!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక  రాజధాని బెంగళూరులో భారీ వర్షం దంచి కొడుతోంది. ఆదివారం కురిసిన వాన అయితే 133 ఏళ్ల అత్యధిక వర్షపాతం రికార్డును బద్ధలు కొట్టింది. ఈశాన్య రుతుపవనాల తొలి జల్లులోనే చుక్కలు చూపిస్తోంది. భారత వాతావరణ శాఖ(ఐఎండి) ప్రకారం ఆదివారం బెంగళూరు నగరంలో 111.1మి.మీ వాన కురిసింది.

పూర్వం 1891 జూన్ 16న అత్యధిక వర్షపాతం 101.6 నమోదయింది. సాధారణంగా బెంగళూరు సగటు వర్షపాతం జూన్ నెలలో 106.5 మి.మీ ఉంటుంది. బెంగళూరులో మరి రెండు రోజులపాటు వానలు పడతాయని ఐఎండి పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడొచ్చని పేర్కొంది. ఈసారి బెంగళూరు నగరం జూన్ నెలలో అత్యధిక వర్షపాతం రికార్డును నమోదుచేయొచ్చని వార్త. ఇప్పటి వరకున్న రికార్డు ప్రకారం 1996లో 228.2 మి.మీ వర్షపాతం నమోదయింది. వానలకు చెట్లు విరిగిపడుతున్న ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. ఒక్క జయనగర్ లోనే 40 చెట్లు విరిగిపడ్డాయి.  ఈదురు గాలులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం మరో ఇబ్బందిగా ఉంది. వాహనాల రాకపోకలు కూడా చాలా స్లోగా ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News