Tuesday, April 1, 2025

కాంగ్రెస్ కు ఆ రాష్ట్రం నుంచి డబ్బులు వస్తున్నాయి….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో బిల్డర్ల నుంచి ఒక చదరపు అడుగుకు  రూ.500 రాజకీయ ఎన్నికల పన్ను వసూలు చేస్తోందని మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ పన్నులను తెలంగాణ కాంగ్రెస్‌కు పంపిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి వారసత్వంగా స్కామ్‌లు చేయడమే తెలుసునని చురకలంటించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి స్కాంగ్రెస్ అని పేరు పెట్టామన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం కర్నాటక నుంచి కాంగ్రెస్ నేతల డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. డబ్బులతో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని మండిపడ్డారు. తెలంగాణలో స్కాంగ్రెస్ ఆటలు చెల్లవన్నారు.

Also Read: సిరులొలికించే వరి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News