- Advertisement -
బెంగళూరు: నగరానికి చెందిన పారిశ్రామికవేత్త ప్రదీప్ ఆత్మహత్య కేసుకు సంబంధించి బిజెపి ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పసమీపంలోని అమలిపురలో నివిసిస్తున్న 47 ఏళ్ల ప్రదీప్ ఆదివారం తుపాకీ పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన సూసైడ్ నోట్‌లో బిజెపి ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, మరో ఐదుగురు పేర్లను ప్రేర్కొన్నారు.
మాజీ మంత్రి అయిన లింబావలితోపాటు జి రమేష్ రెడ్డి, కె గోపి, డాక్టర్ జయరాం రెడ్డి, రాఘవ్ భట్, సోమయ్య పేర్లను ప్రదీప్ తన లేఖలో ప్రస్తావించారు. బెంగళూరు సమీపంలోని రాంనగర్ వద్ద నున్న రిసార్ట్‌కు ఆదివారం వెళ్లిన ప్రదీప్ తన కారులో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిందితులు లింబావలితోపాటు ఇతరులపై కగ్గలిపుర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -