Wednesday, January 22, 2025

బెంగళూరులో జంట హత్యల కలకలం.. రగిలిన పగలు ?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : స్థానికంగా ఉండే ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ ఏరోనిక్స్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫణింద్ర సుబ్కమణ్య (36), కంపెనీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) వినూ కుమార్ (40)లను మంగళవారం రాత్రి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నివాసిత ప్రాంతం అమృతవల్లి వద్ద ఉండే పంపా ఎక్స్‌టెన్షన్ వద్ద వీరిని దుండగులు నరికి చంపారు. ఈ జంట హత్యలు బెంగళూరులో తీవ్రకలకలకం రేపాయి. ఎండి, సిఇఒ ఆఫీసులో ఉన్నప్పుడే నిందితులు లోపలికి చొరబడి వీరిని కత్తులతో నరికి చంపినట్లు,ఉద్యోగులు చూస్తూ ఉండగానే ఈ హత్యలు జరిగినట్లు వెల్లడైంది.

ఒక్కరోజు తరువాత బుధవారం హత్యలకు పాల్పడ్డ ముగ్గురు షబారిష్ అలియాస్ ఫెలిక్స్ (27),వినయ్ రెడ్డి (23), సంతోష్ అలియాస్ సంతూను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా దుండగులు ఎండిపై దాడికి దిగినట్లు, ఆయనను రక్షించేందుకు అక్కడికి వినూకుమార్ రావడంతో ఆయన కూడా కత్తివేట్లుకు గురయ్యినట్లు , ఆ తరువాత వీరిరువురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడైంది. మృతికి కారణాలు వెంటనే తెలియలేదు. అయితే వ్యాపార కారణాలతోనే కక్ష పెంచుకుని ప్రధాన నిందితుడు ఫెలిక్స్ మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాధమికంగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News