Monday, December 23, 2024

జడ్జీలను బెదిరించిన ఇద్దరిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు

- Advertisement -
- Advertisement -

Kovai Rahmatullah
బెంగళూరు: కర్నాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం జడ్జీలను బెదిరించినందుకు తమిళనాడుకు చెందిన ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు తురునెల్వేలికి చెందిన కొవై రహమతుల్లా కాగా, మరొకరు తంజావూరుకు చెందిన ఎస్. జమాల్ మొహమ్మద్ ఉస్మానీ. వారిద్దరిని శనివారం రాత్రి(మార్చి19) అరెస్టు చేశారు. వారిద్దరూ తమిళనాడు తౌహీద్ జమాత్(టిఎన్‌టిజె) ఆఫీసు బేరర్లు. కర్నాటక, తమిళనాడులో వారిపై వచ్చిన అనేక ఫిర్యాదుల మేరకే వారిని అరెస్టు చేశారు. వారు జడ్జీలను బెదిరించడంపై తమిళనాడు బిజెపి చీఫ్, కర్నాటక కేడర్ మాజీ ఐపిఎస్ అధికారి కె. అన్నామళై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్.భండారీకి రాయడమేకాక, విచారణ జరపాలని కోరారు.
కర్నాటకలో న్యాయవాది సుధా కత్వా ఫిర్యాదు మేరకు బెంగళూరులోని విధాన సౌధ పోలీసులు ఎఫ్‌ఐఆర్ బుక్ చేశారు. ఫిర్యాదులో వారు బెదిరించారని, అనుచిత పదజాలంను ఉపయోగించారని, శాంతిని, సామరస్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పోలీసులు ఐపిసి సెక్షన్లు 506(1), 505(1), 153ఎ, 109, 504 కింద ఎఫ్‌ఐఆర్‌ను రిజిష్టర్ చేశారు. కాగా న్యాయవాది ఉమాపతి కర్నాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఓ వినితిని దాఖలు చేశారు. బెంగళూరు న్యాయవాదుల సంఘం కూడా వారి చర్యలను ఖండించింది. ఇదిలావుండగా బెంగళూరు పోలీసులు హైకోర్టు జడ్జీలకు భద్రతను కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News