Friday, January 10, 2025

రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

బిజెపి నాయకుడు ఒకరు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జూన్ 7న తమ ఎదుట హాజరుకావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని బెంగళూరు కోర్టు శనివారం ఆదేశించింది. 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపిపై 40 శాతం కమీషన్ అంటూ చేసిన ఆరోపణలపై కర్నాటక బిజెపి ప్రధాన కార్యదర్శి, ఎంఎల్‌సి కేశవ్ ప్రసాద్ దాఖలు చేసిన పరవునష్టం పిటిషన్‌లో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీచేసింది. ఇదే కేసులో శనివారం 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరైన ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ బెయిల్ పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News