- Advertisement -
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు ఆభరణాలను ఆ రాష్ట్రానికి అప్పగిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు వెల్లడించింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలను తీసుకువెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలను తెచ్చుకోవాలని తమిళనాడు సర్కార్ ను కోర్టు ఆదేశించింది.
మార్చి 6, 7వ తేదీల్లో ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, ఇతర భద్రతా సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకెళ్లాలని తెలిపింది. 1996లో అక్రమ సంపాదన కేసులో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు.. ప్రస్తుతం కర్ణాటక సర్కార్ ఆధీనంలో ఉన్నాయి. ఈ కేసును మంగళవారం విచారించిన బెంగళూరు కోర్టు.. జయలలిత బంగారు ఆభరణాలను తమిళినాడుకు అప్పగిస్తూ తీర్పు చెప్పింది.
- Advertisement -