Thursday, February 20, 2025

అలా పని చేయడానికైనా రెడీ.. ఓ నిరుద్యోగి పోస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చదువు పూర్తి చేసుకున్న ఓ విద్యార్థి ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. దాదాపు రెండు సంవత్సరాలు ఉద్యోగం కోసం ఎదురుచూసినా.. అతనికి నిరాశే ఎదురైంది. దీంతో అతను ఓ వినూత్నమైన ప్లాన్ వేశాడు. అదేంటంటే.. జీతం లేకపోయానా తను పని చేయడానికి సిద్ధంగా ఉన్నను అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరుకు చెందిన ఈ గ్రాడ్యూయేట్ తన రెజ్యూమేను రెడ్డిట్‌లో పోస్ట్ చేస్తూ.. ‘2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. కానీ, ఉద్యోగం సాధించలేకపోతున్నాను. నా రెజ్యూమేని కాల్చేసినా పర్వాలేదు. కానీ నాకు మాత్రం ఉద్యోగం ఇవ్వండి. నేను ఉచితంగా పని చేయడానికైనా సిద్ధమే’ అంటూ పేర్కొన్నాడు. ఇది చూసిన నెటిజన్లు అతనికి సలహాలు, సూచనలు చేశారు. మరి ఇది చూశాకైనా.. అతనికి ఉద్యోగం వస్తుందేమో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News