Wednesday, January 22, 2025

వాటా డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన ఆర్‌టిసి డ్రైవర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తండ్రి పేరు మీద ఉన్న ఆస్తులను అమ్మి తన వాటా డబ్బులను ఇవ్వడం లేదని తల్లిని ఆర్‌టిసి డ్రైవర్ చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని హోంగాసంద్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జయమ్మ ఇద్దరు కుమారులు ఉమేష్, సత్తీస్ లు ఉన్నారు. జయమ్మ భర్త చనిపోవడంతో ఆయనకు చెందిన ఆస్తులను అమ్మేసింది. వచ్చిన డబ్బులను మిత్తీలకు ఇచ్చి జీవనం సాగిస్తోంది. ఆమె పెద్ద కుమారుడు ఉమేష్ కెఎస్‌ఆర్‌టిసిలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉమేష్ మద్యానికి బానిసగా మారాడు. తన వాటాకు వచ్చే డబ్బులు ఇవ్వాల్సిందిగా పలుమార్లు తల్లిని అడిగాడు. దీంతో తల్లి, కమారుడు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

దీంతో పెద్ద కుమారుడికి దూరంగా ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. సురేష్ అనే వ్యక్తి సహాయంతో తల్లి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెతో ఉమేష్ గొడవపడ్డాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో తల్లి ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అనంతరం తల్లి గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజుల ఆమె ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి కుమారుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News