Tuesday, April 1, 2025

పట్టాలు తప్పిన కామాఖ్య రైలు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి కామాఖ్య(గౌహతి) వెళ్లే ఈ రైలు.. కటక్-నెర్గుండి మధ్య పట్టాలు తప్పింది. ఆదివారం ఉదయం 11.54 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే సిపిఆర్‌వొ అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. మొత్తం 11 భోగీలు పట్టాలు తప్పిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. రైలు వేగం తక్కువ ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ఘటనస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు డిఎం దత్తాత్రేయ బహుసాహెబ్ తెలిపారు. కామాఖ్య రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక రైలును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రైలు మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News