Monday, January 20, 2025

దూరపు బంధువుతో సంబంధం… ఇంజనీరింగ్ విద్యార్థిని తగలబెట్టి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి దూరపు బంధువుతో సంబంధం పెట్టుకోవడంతో అతడిని కిడ్నాప్ చేసి తగలబెట్టిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. ప్రస్తుతం సదరు విద్యార్థి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రాజరాజేశ్వరీ నగర్‌లో రంగనాథ్ అనే వ్యక్తి శశాంక్ అనే కుమారుడు ఉన్నాడు. శశాంక్ ఎసిఎస్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శశాంక్ దూరపు బంధువైన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియడంతో శశాంక్ బెదిరించడంతో తన కూతురుకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. శనివారం శశాంక్ ఇంటి నుంచి కాలేజీకి వెళ్తుండగా కారులో ఏడుగురు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. శశాంక్‌ను కనిమినిక్ టోల్‌ప్లాజా వద్దకు తీసుకెళ్లి అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. అతడు తీవ్రంగా గాయపడడంతో వాహనదారులు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శశాంక్ తండ్రి రంగనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News