Wednesday, January 8, 2025

హోటల్‌లో యువతిని పొడిచి చంపి….

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: 22 ఏళ్ల యువతిని హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి చంపేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ఇందిరానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అస్సాంకు చెందిన మాయా గోగోయ్ అనే యువతి మూడు సంవత్సరాల నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్‌లో నివసిస్తోంది. కోరమంగళ్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ వ్లాగర్‌గా వీడియోలు చేస్తుంది. డబుల్ బెడ్ రోడ్ పార్కులోని రాయల్ లివింగ్ హోటల్‌కు మాయ తన స్నేహితుడు అర్నవ్‌తో కలిసి వచ్చింది.

నవంబర్ 24న ఉదయం బ్రేక్ పాస్ట్ కోసం హోటల్ సిబ్బంది రూమ్ డోర్‌ను తట్టాడు. రూమ్ లోపల నుంచి స్పందించకపోవడంతో సిసి కెమెరాలను పరిశీలించారు. అర్నావ్ రూమ్‌లో నుంచి వెళ్లిపోయినట్టుగా గుర్తించడంతో డూప్లికేట్ తాళం చేవితో రూమ్ డోర్‌ను ఓపెన్ చేశారు. మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై ఆరు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అర్నావ్ కేరళ రాష్ట్రానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News