Thursday, January 23, 2025

మద్యం మత్తులో ర్యాపిడో బుక్ చేసుకున్న యవతిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: బెంగళూరులోని ఐటి కంపెనీలో పనిచేస్తున్న కేరళ యువతిపై అత్యాచారం జరిగింది. రాత్రి విధుల తర్వాత యువతి ఇంటికి వెళ్లేందుకు రాపిడో రైడ్ బుక్ చేసుకుంది. యువతి మద్యం మత్తులో ఉన్నట్లు బైక్ రైడర్ గుర్తించాడు. తన స్నేహితుడితో కలిసి బైక్ రైడర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారేవరకు యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తు వీడాక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు బైక్ రైడర్, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News