Wednesday, January 15, 2025

ఫ్లై ఓవర్‌పై స్కూటర్లతో సయ్యాటలు..బైక్‌లను కిందేసిన స్థానికులు

- Advertisement -
- Advertisement -

ఫ్లై ఓవర్‌పై స్కూటర్లతో సయ్యాటలకు దిగిన వారికి స్థానికులు తగు విధంగా బుద్ధి చెప్పారు. రద్దీతో ఉండే ఇక్కడి నేలమంగళ ఫ్లై ఓవర్‌పై ఆగస్టు 15న విన్యాసాలకు దిగిన వారిని అడ్డగించి వారి బైక్‌లను లాక్కుని పై నుంచి కిందికి పడేశారు. తోటి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని కూడా పట్టించుకోకుండా బైకర్లు చెలరేగిపోతూ ఉండటం, ఎంత చెప్పినా వెర్రిచేష్టలు మానకపోవడంతో జనాలకు చిర్రెత్తింది.

స్టంట్లకు దిగిన వారు తప్పించుకుని పారిపోగా వారి వాహనాలు రోడ్డు పాలయ్యాయి. ఈ మార్గంలో జరిగిన ఘటనను కొందరు వీడియో తీశారు. సామాజిక మాధ్యమంలో ఇది వైరల్ అయింది. తరువాత పోలీసులు రంగంలోకి దిగారు. స్టంట్లకు దిగిన వారితో పాటు వాహనాలను కిందపడేసిన వారు 36 మందిపై కేసులు దాఖలు చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కల్గించారని పేర్కొంటూ కేసులు దాఖలు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News