Sunday, December 22, 2024

22 మంది పాక్ పౌరులకు ఆశ్రయం… బెంగళూరులో వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: హిందువుల పేర్లతో 22 మంది పాకిస్తానీ పౌరులు బెంగళూరుతోపాటు కర్నాటకలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడేందుకు వారికి ఆశ్రయమిచ్చిన పర్వేజ్ అనే వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు మంగళవారం తెలిపాయి. బెంగళూరు శివార్లలోని జింగాని వద్ద ఇటీవల ఒక కుటుంబానికి చెందిన నలుగురు పాకిస్తానీ పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించడంతో నగరంలోని పీన్యా వద్ద మరో ముగ్గురు పాక్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడంతో మరికొందరు పాకిస్తానీ పౌరులు దావణగెరె జిల్లాలో నివసిస్తున్నట్లు తెలియచడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ పర్వేజ్ హిందూ పేర్లతో నకిలీ పత్రాలను సృష్టించినట్లు దర్యాప్తులో తేలిందని వర్గాలు తెలిపాయి. పర్వేజ్‌ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News