Saturday, December 21, 2024

10 ఏండ్లలో 15 పెళ్లిళ్లు…

- Advertisement -
- Advertisement -

మైసూరు : డాక్టర్‌ను, ఇంజనీర్‌నని చెబుతూ మహిళలను నమ్మించి, మోసగించి ఏకంగా 15 పెళ్లిళ్లు చేసుకున్న ఓ కన్నడ వ్యక్తి విషయం వెలుగులోకి వచ్చింది. 35 ఏండ్ల మహేష్ నాయక్ అనే బెంగళూరు నివాసి 2014 నుంచి తన కపటపెళ్లిళ్ల తంతు సాగిస్తూ వస్తున్నాడు. కొందరు మహిళలకు తాను ఇంజనీర్‌ను అని, మరికొందరికి తాను డాక్టర్‌ను అని చెపుతూ గుట్టుచప్పుడు కానిరీతిలో 15 మందిని పెళ్లి చేసుకున్నాడు. కనీసం నలుగురు పిల్లల తండ్రి అయ్యాడు. బెంగళూరులోని బన్సహంకరికి చెందిన ఈ నాయక్ లోగుట్టు ఈ ఏడాది ఆరంభంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగినితో పెళ్లి తరువాత రట్టయ్యింది. చుట్టపుచూపుగా వచ్చే ఈ నాయక్ వ్యవహారం గురించి అనుమానం వచ్చి ఈ లేడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనితో పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి, ఆరాల మీద ఆరాలు తీయగా ఎట్టకేలకు తూముకూరులో పోలీసుల వలలో చిక్కాడు. ఇంతకూ ఈ ఘనుడు చదివింది కేవలం ఐదో తరగతివరకే. అయితే తాను డాక్టర్‌ను, ఇంజనీరును, కాంట్రాక్టరును అని చెప్పి నమ్మించడంలో యాక్టర్లను మించిపోయాడు. ఆయన ద్వారా నలుగురు మహిళలు తల్లులు అయ్యారు. ఈ వ్యక్తిపై ఫిర్యాదు చేసిన మహిళ ఆయన తనను కట్నం కావాలని, తానో క్లినిక్ పెట్టుకునేందుకు ఒత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఇచ్చేది లేదని చెప్పడంతో ఆమె నగదు నగలు ఎత్తుకుని ఉడాయించాడు. దీనితో పోలీసులను ఆశ్రయించిన మహిళ వల్ల ఈ మోసగాడి అసలు స్వరూపం ఇతరులకు తెలిసివచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News