Wednesday, January 22, 2025

బెంగళూరులో 19 మంది ముస్లింలు అరెస్టు

- Advertisement -
- Advertisement -

Arrest

బెంగళూరు: ‘మిలాద్-ఉన్‌నబీ’(అక్టోబర్ 9న) పండుగ నాడు బెంగళూరులో కత్తులు ఝళిపిస్తూ ఊరేగింపు తీసినందుకు పోలీసులు 19 మంది ముస్లింలను అరెస్టు చేశారు. వారిలో 14 మంది మైనర్లు. దక్షిణ బెంగళూరులోని సోమేశ్వర్ నగర్‌లో ఆదివారం రాత్రి 6.30 నుంచి 7 గంటల మధ్య జరిగిన ఊరేగింపులో వారు కత్తులు ఝళిపించినందుకుగాను వారిని అరెస్టు చేశారు. పోలీసులు స్వతంత్రంగానే ఆయుధాల చట్టం కింద కేసును నమోదు చేశారు. ఊరేగింపు, కత్తులు ఝళిపించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. కత్తులు వంటి ఆయుధాలు ప్రదర్శించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక సందర్భాలలో వారు అనుమతి ఇవ్వడం జరుగుతుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News