Sunday, January 19, 2025

సోనియా, రాహుల్‌పై తప్పుడు వార్తలు.. బంగ్లాదేశ్ జర్నలిస్ట్‌పై కేసు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో విపక్షనాయకుడు రాహుల్ గాంధీ, అతని తల్లి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీలపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ జర్నలిస్టు సలా ఉద్దీన్ షోయబ్ చౌదరి, భారతీయ న్యూస్ పోర్టల్ ఉద్యోగి అతిధిపై హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని పోలీస్‌లు చెప్పారు.

సోనియా గాంధీని విదేశీ గూఢచారి అంటూ బంగ్లాదేశ్ జర్నలిస్‌ట షోయబ్ చౌదరి తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారని , అలాగే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో జర్నలిస్ట్ ఈ పోస్ట్‌ని షేర్ చేసినట్టు తెలిపారు. రాహుల్ గాంధీపై కూడా ఆరోపణలు చేసినట్టు శ్రీనివాస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 196, 353 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీస్‌అధికారి చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, ఈమేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News