Monday, January 20, 2025

లవ్ ఎఫైర్.. యువకుడిని కిడ్నాప్ చేసి నిప్పంటించిన..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ కాలేజీ విద్యార్థిని కిడ్నాప్ చేసి నిప్పంటించిన ఘటన బెంగళూరులో సంచలనం రేపుతోంది. బాధితుడిని చికిత్స నిమిత్తం విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌ఆర్‌ నగర్‌ కు చెందిన కాలేజ్ స్టూడెంట్ శశాంక్‌, మైసూరుకు చెందిన దూరపు బంధువైన ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరి ప్రమను ఇరువర్గాల తల్లిదండ్రులు వ్యతిరేకించారు. తర్వాత ఈ నెల 3న బెంగళూరుకు వచ్చిన అమ్మాయిని శశాంక్ తన ఇంటికి తీసుకెళ్లింది.

ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఇంట్లోకి దూసుకెళ్లి శశాంక్‌పై దాడి చేసి అమ్మాయిని తమ వెంట తీసుకెళ్లారు. శనివారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకుని బస్సు కోసం ఎదురు చూస్తున్న శశాంక్‌పై కొంతమంది దుండగుల ముఠా కిడ్నాప్ చేసింది. అనంతరం చేతులు, కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి దుండగులు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుప్రక్కలవారు గమనించి మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News