Wednesday, January 22, 2025

లిఫ్ట్ ఇచ్చి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఆదివారం అర్థరాత్రి తరువాత బెంగళూరు నగరంలో 21 ఏండ్ల యువతిపై అత్యాచారం జరిగింది. లిఫ్ట్ ఇచ్చిన ఓ బైకర్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాలేజీ విద్యార్థిని అయిన ఈ అమ్మాయి ఓ విందుకు వెళ్లి వస్తుండగా , ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. ఆమె చెప్పిన చోటికి కాకుండా ఎవరూ లేని ప్రాంతానికితీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు నగర ఈస్ట్ జోన్ పోలీసు అదనపు కమిషనర్ రామన్ గుప్తా తెలిపారు. ఆమెపై దాడి జరిపి తరువాత అత్యాచారానికి దిగినట్లు నిర్థారణ అయింది.

రాత్రి ఒంటి గంట తరువాత ఈ ఘటన జరిగింది. హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్‌లోని హోసూర్ సర్వీసు రోడ్డు వద్ద ఓ ట్రక్కు పక్కన దాదాపుగా ఆమె నగ్నంగా పడి ఉంది. కేవలం ఎరుపు జాకెట్ ఆచ్ఛాదనే ఉంది. దీన స్థితిలో పడి ఉన్న ఈ యువతిని గుర్తించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చికిత్సకు తరలించినట్లు పోలీసు అధికారి చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. సంబంధిత ఘటనపై నూతన భారతీయ న్యాయ చట్టం బిఎన్‌ఎస్ పరిధిలో కేసు దాఖలు చేశారు. దర్యాప్తు చేపట్టారని కూడా ఎసిపి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News