Saturday, December 28, 2024

వధువును వదిలేసి వరుడు పరుగో పరుగు…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అంతాయింతా కాదు. అది కొత్త పెళ్ళి కొడుకు పారిపోడానికి కూడా పనికొచ్చింది. బెంగళూరులో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి మరునాడే వధువును వదిలేసి పారిపోయడు. ఈ ఘటన గత నెల చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట చర్చి నుంచి తిరిగి వస్తుండగా వారి కారు మహాదేవపుర వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. మార్గమధ్యంలో కారు తలుపు తెరుచుకుని వరుడు పారిపోయాడు. అతడి భార్య కారు దిగి వెంబడించడానికి ప్రయత్నించింది. కానీ అతడిని పట్టుకోలేకపోయింది. మహిళ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వరుడి కోసం గాలిస్తున్నారు.

వారి పెళ్లయ్యాక, వరుడు తన మాజీ ప్రియురాలు తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని వధువుకు తెలిపాడు. కాగా తాను, తన కుటుంబం అతనికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చింది. పెళ్లికి ముందే వరుడు తన వ్యవహారం వధువుకు తెలుపడమేకాక, ఆ మాజీ ప్రియురాలిని వదిలివేస్తానని కూడా చెప్పాడు.

Bangalore traffic jam

వధువు తన ఫిర్యాదులో ‘ఆయన ప్రియురాలు వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. తనని ఎక్కడ బజారుకీడుస్తుందోనని ఆయన పారిపోయాడు’ అని నవ వధువు తన ఫిర్యాదులో పేర్కొంది.

వరుడు గోవాలో తన తండ్రి నడిపే మ్యాన్‌పవర్ ఏజెన్సీలో పనిచేస్తుండే వాడు. అప్పుడే అతడు తన ప్రియురాలితో వ్యవహారం నడిపాడు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. తమ కంపెనీలో ఓ డ్రైవరు భార్య కూడా. ఆ కంపెనీలో వరుడు క్లర్క్‌గా పనిచేసేవాడు. కానీ అతడి కుటుంబం అతడు వ్యవహారం నడిపిస్తున్నాడని తెలిసి,  పోలీసులకు ఫిర్యాదు చేసిన వధువుతో పెళ్లి ఏర్పాటుచేసింది. వధువుకు కూడా పెళ్లి కొడుకు వ్యవహారం నడిపిన సంగతి తెలుసు.

‘ఆమె ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తుందోనని అతడు పారిపోయాడు. అతడిలో చచ్చిపోవాలన్న భావాలు కూడా చూశాను. అతడు సురక్షితంగా ఉండొచ్చని, త్వరగా తిరిగొస్తాడని భావిస్తున్నాను’ అని వధువు వార్తాపత్రికకు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News