ఐపిఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు మునుపటి ఫామ్‌నే కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉన్న ఆర్‌సిబి మంగళవారం లక్నోతో పోరుకు సిద్ధమైంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. పంజాబ్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి రెండో విజయాన్ని నమోదు చేయాలనే తపనతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుస ఓటములకు చెక్ పెట్టాలనే లక్షంతో కనిపిస్తోంది.
ఇక తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఘోర ఓటమిపాలైన లక్నో తరువాతి మ్యాచ్‌లో పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదే జోరును బెంగళూరుపై సయితం కొనసాగించాలనే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. బెంగళూరును కూడా ఓడించి రెండో విజయాన్ని అందుకోవాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఏదీఏమైనా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమనే చెప్పొచ్చు.