బెంగళూరు హౌసింగ్ సొసైటీ హెచ్చరిక
బెంగళూరు : నగరంలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా నీటిని దుబారా చేయకుండా ఉండడానికి హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ సొ సైటీ లో నివసించే వారిలో ఎవరైనా తాగునీటిని దుర్వినియోగం చేసినా, అవసరానికి మించి ఎక్కువ వాడినా వారికి రూ. 5 వేలు వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీనిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించింది.
వాడకం దారులు ఈ నిబంధనలను ఖాతరు చేయకుండా పదేపదే నీటిని అత్యధికంగా వినియోగించిన కొద్దీ రూ. 5000 కు మించి జరిమానా పెరుగుతుంది. బెంగళూరు లోని అనేక హౌసింగ్ సొసైటీలు నివాసితులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి. వైట్‌ఫీల్డ్, యల్హంక, కనకపుర, తదితర ప్రాంతాల్లో తీవ్ర నీటిఎద్దడి వెంటాడుతోంది. వైట్‌ఫీల్డు లోని పామ్‌మీడోస్ హౌసింగ్ సొసైటీ తమ నివాసితులకు నీటి సమస్యపై నోటీస్ జారీ చేసింది. బెంగళూరు వాటర్ సప్లై , సూయెరేజ్ బోర్డు నుంచి గత నాలుగు రోజులుగా నీటిసరఫరా కావడం లేదని హెచ్చరించింది.