న్యూస్ డెస్క్: యూనిఫారమ్‌తోపాటు తన మతాన్ని సూచించే స్కల్ క్యాప్ ధరించినందుకు బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ(బిఎంటిసి) కండక్టర్‌ను ఒక ప్రయాణికురాలు నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
డ్యూటీలో ఉండగా స్కల్ క్యాప్ ఎందుకు ధరించావని బస్సు కండక్టర్‌ను ఆ మహిళ పదేపదే ప్రశ్నించడాన్ని వీడియోలో చూడవచ్చు. యూనిఫారమ్‌తోపాటు క్యాప్ ఎందుకు ధరించావని, అది ధరించడం సబబేనా అని ఆమె కండక్టర్‌ను నిలదీశారు. ఆమె ప్రశ్నలకు కండక్టర్ మౌనంగా ఉండిపోగా ఒక ప్రభుత్వ ఉద్యోగివి అయ్యుండి యూనిఫారమ్‌తోపాటు క్యాప్ ఎలా ధరిస్తావు, ఇది ధరించడం సమంజసమేనా అని ఆమె ప్రశ్నించారు.
తాను చాలా ఏళ్లుగా డ్యూటీలో క్యాప్ ధరిస్తున్నానని, ఇప్పటివరకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఆ కండక్టర్ బదులివ్వడం చూడవచ్చు. అయితే ఈ సమాధానంతో ఆ ప్రయాణికురాలు సంతృప్తి చెందలేదు. మీ మతాన్ని మీ ఇంట్లోనో మసీదులోనో పాటించకోండి. కాని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా డ్యూటీలో ఉన్నపుడు క్యాప్ ధరించకూడదు అని ఆమె కండక్టర్‌కు హితవు చెప్పారు. చివరకు ఆ కండక్టర్ తన తలపైని పచ్చ టోపీని తీసివేయడం వీడియోలో కనిపించింది.
ವಾಟ್ಸಾಪಲ್ಲಿ ನೋಡ್ದೆ. ಆ ಮಹಿಳೆಯ ಹೃದಯದಲ್ಲಿ ತುಂಬಿದ ಕೋಮು ವಿಷದ ತೀವ್ರತೆಯನ್ನು ಅಳೆಯುವ ಯಂತ್ರವೊಂದಿದ್ರೆ ಅದರ ಮುಳ್ಳುಗಳೇ ಒಡೆದುಹೋಗುತ್ತಿದ್ವೆನೋ?. ಕುಂಕುಮ, ಮಾಲೆಗಳನ್ನು ಧರಿಸುವಂತೆ ಟೋಪಿಗೂ ಅವಕಾಶವಿದೆಎಂದಾಗಿದೆ ನನ್ನ ಭಾವನೆ. ಏನಿದ್ದರೂ ವಿಷ ಕಾರುತ್ತಿರುವ ಮಹಿಳೆಯ ಮುಂದೆಯೂ ಸೌಮ್ಯವಾಗಿ ನಡೆದುಕೊಂಡ ನಿರ್ವಾಹಕರಿಗೆ ನನ್ನದೊಂದು ಸಲಾಂ pic.twitter.com/RFaIXGuq3M
— Mohamed Haneef (@Mohamed47623244) July 11, 2023