Friday, December 20, 2024

నుదుటిపై పచ్చబొట్టుగా భర్త పేరు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తమ మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి దంపతులు భిన్నమార్గాలను ఎంచుకుంటారు. అయితే తన భర్త పేరును నుదుటిమీద పచ్చబొట్టు పొడిపించుకుని ఒక మహిళ భర్త మీద తన ప్రేమను చాటుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.బెంగళూరుకు చెందిన టాటూ స్టూడియో కింగ్ మేకర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్త సతీష్ పేరును మొదట కాగితం మీద చాసిన అక్షరాలతో అతికించుకుని, తరువాత దానిపైన టాటూ ఆర్టిస్టుతో పెన్సిల్‌తో దిద్దించుకున్న ఆ మహిళ చివరగా దానిపైన పచ్చబొటు మిషన్‌తో రాయించుకుంది.

Also Read: కర్నూలు లో ఉత్కంఠ..

తన భర్త పేరును తన నుదుటిపై శాశ్వతంగా రాయించుకున్న ఆ మహిళ చర్య పట్ల సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రశంసల మాట ఎలా ఉన్నప్పటికీ విమర్శలు మాత్రం తీవ్రస్థాయిలో ఎదురవుతున్నాయి.ఈ వీడియోను వీక్షించిన పలువురు నెటిజన్లు తన భర్త పేరును నుదుటిపై పచ్చబొట్టుగా ముద్రించుకున్న ఆ మహిళ చర్యను తప్పుపడుతూ డిస్‌లైక్ చేస్తున్నారు. చేతిరాత మీద రాయించుకుంటే ఫర్వాలేదేమో కాని పచ్చబొట్టును నుదుటిపై పొడిపించుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News