Saturday, December 21, 2024

చలికాలంలో ఈ పండు తింటే..?

- Advertisement -
- Advertisement -

చలికాలం రాగానే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ సీజన్లో అందరికీ జలుబు, దగ్గు వంటివి రావడం సాధారణం. చలి ఎక్కువగా ఉండటం వల్ల దీనినైనా తినడానికి వెనకడుతాము. అయితే, రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు ఒకటుంది. ఈరోజు మనం జామకాయ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం జమ పండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి యాపిల్ ధర కంటే చాలా తక్కువగా ఉంటాయి. అందుకే దాదాపు అందరూ దీనిని కొంటారు. జామ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

జామ పండులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలోని అలెర్జీలతో పోరాడుతుంది.

మలబద్ధకంతో బాధపడే వారికి జామ ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ పండును తీసుకోవడం వల్ల దీనిలో ఉన్న పోషకాలు జీర్ణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి.

జామ పండు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఎవరికైనా కంటి చూపు బలహీనంగా ఉంటే దీనిని పుష్కలంగా తినవచ్చు. జామ పండులో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటికి మేలు చేస్తుంది. కళ్ళలో నీరు కారుతున్న వారు కూడా జామపండును తీసుకుంటే వారికి ఎంతో మేలు జరుగుతుంది.

మధుమేహం ఉన్నవారు జామ పండును కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో త్వరగా పెంచదు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ పండును తీసుకోవడం చాలా మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News