Wednesday, January 22, 2025

పచ్చి వెల్లుల్లి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

- Advertisement -
- Advertisement -

శతాబ్దాలుగా వెల్లుల్లి దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటుంది. అనేక వంటకాలలో దీనిని ఉపయోగిసస్తాం. అయితే, ఈ చిన్న వెల్లుల్లి అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పరిగణించబడుతుందని మీకు తెలుసా? ముఖ్యంగా.. కాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ఇప్పుడు ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్నీ తగ్గించి గుండె పోటు స్ట్రోక్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది.

వెల్లుల్లి రక్తం గడ్డకట్టడానికి కూడా నిరోధిస్తోంది. దీంతో గుండెపోటు ప్రమాదం కూడా రాదు. ఈ పదార్థంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. అందుకారణంగా జలుబు దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడవచ్చు.

అంతేకాకుండా.. వెల్లుల్లి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచి చిర్నక్రియను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా కడుపు,పేగు, రొమ్ము క్యాన్సర్ కు ప్రయోజనకరంగా ఉంటుంది.

వెల్లుల్లి ఎలా, ఎంత తీసుకోవాలి?

ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినవచ్చు. కావాలంటే నమిలి కూడా తినవచ్చు. పెరుగు లేదా తేనెతో కలుపుకొని కూడా తినవచ్చు.

ఈ విషయాలను గుర్తించుకోండి

కొందరికి వెల్లుల్లి వల్ల ఎలర్జీ కూడా రావచ్చు. అప్పుడు దీనిని దూరంగా దూరం పెట్టడం మంచిది. వెల్లుల్లి కొన్ని మందులతో సంరక్షణ చెందుతుంది. అందువల్ల మీరు ఏదైనా మందులు తీసుకుంటే పచ్చి వెల్లుల్లి తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News